Friday, 30 April 2021

వామ్మో కల్పిక.. గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. మోనోకినీలో తెలుగు అమ్మాయి అందాలు..!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి చాలాకాలంలో ఓ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది అంటే అది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కల్పిక.. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ విపరీతంగా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో గ్లామర్ షోకి పూర్తి దూరంగా ఉండే ఆమె.. సోషల్‌మీడియాలో మాత్రం రెచ్చిపోతుంటుంది. హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. ఆమె సినిమాల్లో చేసేది సపోర్టింగ్ పాత్రలే అయినా.. హీరోయిన్స్‌లా శరీరాకృతి మెయింటేన్ చేస్తుంది. అంతేకాదు.. హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనూ అనే రేంజ్‌లో సోషల్‌మీడియాలో ఫోటోలు పెడుతుంది. తాజాగా ఏకంగా ఓ మోనోకిని ధరించి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇంకేముంది కొంత సమయంలోనే ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కల్పిక ఈ ఏడాది ‘సీత ఆన్ ది రోడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వుమెన్ సెంట్రిక్‌గా సాగే ఈ సినిమా అంతలా ఆకట్టుకోలేదు. ఐదు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేన మహిళలు ఎదురుకొనే.. కష్టాలు, పరిస్థితుల చుట్టు ఈ కథ సాగుతోంది. ఇక ఆమె ప్రస్తుతం ‘మా వింతగాధ వినుమా’ అనే సినిమాలో నటిస్తోంది. ఆదిత్య మండలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 13న విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nD0JYl

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...