Thursday 29 April 2021

లాక్‌డౌన్‌లో నిఖిల్ కుటుంబం.. అతని మరణమే అందుకు కారణం.. హీరో సంచలన ప్రకటన

రెండో దశలో వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికే సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు.. త్వరలో పూర్తిస్థాయి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో తారలు మరోసారి పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సిద్ధార్త్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే వరకూ తన కుటుంబం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని అతను తెలిపాడు. నిఖిల్ ప్రస్తుతం.. ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తున్నాడు. అయితే కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఆపేశామని నిఖిల్ తెలిపాడు. ‘‘నా రెండు సినిమాల షూటింగ్‌లు సజావుగా సాగుతున్నాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ చూసిన వైరస్సే కనిపించింది. ప్రతీ ఒక్కరు తమ మిత్రుడికో లేక బంధువుకో కరోనా సోకిందని చెబుతున్నారు. దీంతో మేము మా సినిమాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశాము. పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తాము’’ అని నిఖిల్ పేర్కొన్నాడు. తన భార్య పల్లవితో కలిసి ప్రస్తుతం అన్ని జాగ్రత్తల మధ్య సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్లామని నిఖిల్ తెలిపాడు. ‘‘ఎంతో మంది యువకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. నాకు తెలిసిన వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. అతని వయస్సు 31 సంవత్సరాలే. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఒక డాక్టర్‌గా నా భార్య పల్లవి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. నేను వీలైనంత త్వరగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. పరిస్థితులు మెరుగయ్యే వరకూ మా కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోనే ఉంటాము’’ అని నిఖిల్ స్పష్టం చేశాడు. ఇక ఈ లాక్‌డౌన్‌లో కష్టాల్లో ఉన్నవారికి తగిన సహాయం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని నిఖిల్ తెలిపాడు. బెడ్స్, ఆక్సిజన్, ప్లాస్మా తదితర అవసరాలు ఉన్నవారు తనని సంప్రదించాలని అతను అన్నాడు. అయితే సోషల్‌మీడియాలో చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండాలని అతను సూచించాడు. ప్రస్తుతం తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజలకు సహాయం చేసి సద్వినియోగం చేసుకుంటానని అతను చెప్పాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t5UCNh

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz