దేశంలో మరోసారి కరోనా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది కంటే మించి కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి మళ్ళీ పోయినేడాది ఎదుర్కొన్న సిచుయేషన్‌ని రిపీట్ చేస్తోంది. థియేటర్స్ గేట్లు మళ్ళీ మూసుకున్నాయి. దీంతో ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న సినిమాలు ఓటీటీ బాట పట్టక తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే యాంకర్ ప్రధాన పాత్రలో రూపొందిన '' సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా పెరుగుతుండటంతో కొన్నిరోజుల పాటు వాయిదా వేసి ఓటీటీపై రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ఆహా వేదికపై మే 7 నుంచి 'థాంక్యూ బ్రదర్' సినిమా స్ట్రీమింగ్ కానుందని అనసూయ పేర్కొంది. 'ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ సాధ్యమైనంత సురక్షితమైన మార్గంలో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆమె తెలిపింది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేశ్ రాపర్తి దర్శకత్వంలో ఈ 'థాంక్యూ బ్రదర్' సినిమా రూపొందించారు. అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ యువకుడు, గర్భవతిగా ఉన్న మహిళ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేసింది అనసూయ. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై ఆసక్తి రేకెత్తించి భారీ హైప్ క్రియేట్ చేశాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eyV1T5
No comments:
Post a Comment