తెలుగు వారి కీర్తి దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగిపోతోంది. భారత 48 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 55 ఏళ్ల తరువాత మళ్లీ ఓ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అత్యున్నత పదవిని చేపట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదివి అయిన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో 1966- 67లో జస్టిస్ కోకో సుబ్బారావు సీజేఐ పనిచేశారు. అయితే ఈ శుభ తరుణంలో తెలుగు వారంతా ఎన్వీ రమణకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన తెలుగు తేజం ఎన్వీ రమణ గారు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40 ఏళ్లుగా న్యాయక్షేత్రంలో నిత్యకృషీవలుడు రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 ఏళ్ల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డని చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది అని చిరంజీవి పోస్ట్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dOEgEg
No comments:
Post a Comment