Wednesday, 17 February 2021

రామ్ కొత్త సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్.. తమిళ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ ఇటీవలే RED మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు కమిటయ్యారు. తమిళ దర్శకుడు లింగుస్వామితో మూవీ చేయబోతున్నాడు రామ్. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామ్ తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్నే నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. డైరెక్టర్ లింగుస్వామి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారని.. తెలుగు, తమిళ భాషల్లో ప్యారలల్‌గా ఈ సినిమాను రూపొందించనున్నామని ఆయన పేర్కొన్నారు. హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఎనర్జీని మరో స్థాయిలో ప్రెజెంట్ చేయాలని ఓ మాస్ కథను సిద్ధం చేశారట లింగుస్వామి. అంతేకాదు రామ్‌ని డిఫరెంట్ షేడ్‌లో చూపించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఆయన వినిపించిన కథను రామ్ వెంటనే ఓకే చేశారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bf0RaJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....