Sunday, 21 February 2021

చాలా సంతోషంగా ఉందంటూ శ్రీముఖి పోస్ట్.. అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాములమ్మ

బుల్లితెర రాములమ్మగా సత్తా చాటుతున్న అప్పుడప్పుడు వెండితెరపై కూడా అలరిస్తోంది. నిజానికి హీరోయిన్ కావాలనే ఆకాంక్షతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. కెరీర్ ఆరంభంలోనే చాలా సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లితెర యాంకర్‌గా క్రేజ్ కొట్టేసింది. అప్పటినుంచి బుల్లితెరపై రాణిస్తూ అవకాశం వచ్చిన ప్రతిసారి వెండితెరపై మెరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి చేసిన ఓ ట్వీట్ నెట్టింట పలు సందేహాలకు కారణమైంది. ''జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్, బాబు బాగా బిజీ'' లాంటి సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ చేస్తోంది. పోసాని కృష్ణమురళి, సింగర్ మనో, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా నితిన్ 30వ సినిమాగా రాబోతున్న 'అందాదున్' తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్ శ్రీముఖిని కూడా ట్యాగ్ చేయడంతో ఇందులో శ్రీముఖికి కూడా నటిస్తోందా? డౌట్స్ మొదలయ్యాయి. ఇంతలో ఇదే ట్వీట్‌ని రీట్వీట్ చేసిన శ్రీముఖి అసలు మ్యాటర్ బయటపెట్టేసింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉందని పేర్కొంటూ కామెంట్ వదిలింది. దీంతో ఇందులో శ్రీముఖి రోల్ ఎలా ఉండబోతోంది? హాట్ యాంకర్‌ని ఎలా చూపించబోతున్నారనే కుతూహలం ఎక్కువైంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో శ్రీముఖిని చూపించి అనసూయ లాగే వెండితెరపై ఈమె కెరీర్ టర్న్ చేసేలా ఈ క్యారెక్టర్ ప్లాన్ చేశారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయకుండానే ఈ సినిమాను జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sh60pK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....