Sunday, 21 February 2021

బాలీవుడ్ బ్యూటీలతో విజయ్ దేవరకొండ రచ్చ.. వాట్ ఎ ఫన్ నైట్ అంటూ ఫొటోస్ పోస్ట్ చేసిన ఛార్మి

టాలీవుడ్ రౌడీ స్టార్ బాలీవుడ్ బ్యూటీలతో ఎంజాయ్ చేశారు. వీకెండ్ పార్టీలో భాగంగా యంగ్ హీరోయిన్స్‌తో కలిసి రచ్చ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన నివాసంలో అరేంజ్ చేసిన పార్టీకి ఛార్మి, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సహా పలువరు బాలీవుడ్ బ్యూటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ''మనీష్.. గత రాత్రి మా అందరికీ పార్టీ ఇచ్చినందుకు థాంక్స్. యూ ఆర్ స్వీట్ హార్ట్. వాట్ ఎ ఫన్ నైట్. అద్భుతమైన వ్యక్తులతో సరదాగా ఎంజాయ్ చేశాం. ఫుడ్ చాలా బాగుంది'' అని ట్వట్టర్ ద్వారా వెల్లడించింది ఛార్మి. ఈ మేరకు అక్కడి పార్టీలో దిగిన పిక్స్ ఆమె షేర్ చేసింది. ఛార్మి పంచుకున్న ఈ ఫొటోల్లో పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్, సారా అలీఖాన్, కియారా అద్వానీ కనిపిస్తున్నారు. అందరూ ఫుల్ ఎంజాయ్ మూడ్‌లో ఉండటం గమనించవచ్చు. ఇంకా ఈ పార్టీకి బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరైంది. ప్రస్తుతం ముంబైలో 'లైగర్' మూవీ షూట్ చేస్తున్న పూరి అండ్ టీమ్ ఇలా శనివారం రాత్రి చిల్ అయింది. ఈ ఫొటోస్, ఛార్మి కామెంట్ చూస్తుంటే అంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారని అర్థమవుతోంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ లైగర్ సినిమా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uid3QO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....