Saturday, 20 February 2021

ప్రతిరోజు షూట్ అయ్యాక అదే ఆలోచన.. నా సతీమణి షాలినికి డౌట్ వచ్చేసింది.. నితిన్ కామెంట్స్ వైరల్

ఇటీవలే తన ప్రియురాలు కందుకూరి షాలిని మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడైన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లయ్యాక కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి సినిమాల షూటింగ్స్‌‌లో పాల్గొంటూ చక చకా కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 26న నితిన్ లేటెస్ట్ మూవీ 'చెక్' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ విశేషాలు పంచుకుంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు నితిన్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ 'చెక్' సినిమా రూపొందింది. చిత్రంలో నితిన్ సరసన అందాల భామలు రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్‌ గేమ్‌ టాలెంట్‌తో తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడు అనే ఆసక్తికర పాయింట్ తీసుకొని ఈ మూవీ రూపొందించారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఈ 'చెక్' మూవీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి ఓపెన్ అయ్యారు. తన కెరీర్‌లోనే ‘చెక్‌’ ఓ విభిన్న కథా చిత్రమని, 80 శాతం సినిమా జైలులోనే ఉంటుందని నితిన్‌ పేర్కొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం మానసికంగా సిద్ధమయ్యానని.. ఆ కారణంగా ప్రతిరోజూ షూట్‌ అయిపోయాక అదే ఆలోచనలతో, విచారంగా ఉండేవాడని చెప్పారు. ఇది చూసి తన సతీమణి షాలినికి కూడా డౌట్ వచ్చేసిందని, ఇంతకీ ఆయనకేమైంది? అనే ఆలోచనల్లో పడిందని నితిన్ తెలిపారు. ఇకపోతే ఓ కమర్షియల్‌ హీరోయిన్ అయినా కూడా రకుల్.. పాటలు, రొమాన్స్‌‌కి స్కోప్ లేని ఈ సినిమాను వెంటనే ఓకే చేయడం చూసి షాకయ్యానని నితిన్ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37wmL8a

No comments:

Post a Comment

'Oil Could Cross $100 A Barrel'

'Oil is still well below its all-time highs, and the world is gradually running out of known reserves.' from rediff Top Interviews...