Sunday, 21 February 2021

ఫ్యామిలీతో కలిసి 'ఉప్పెన' మూవీ చూసిన బాలయ్యబాబు.. మెగా హీరోపై నందమూరి నటసింహం కామెంట్స్

ఉప్పెనలా వచ్చి తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖుల మన్ననలు పొందుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రియాలిటీకి దగ్గరగా బ్యూటిఫుల్ ప్రేమకథతో సినీఎంట్రీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఇతనిపై పడింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ వైష్ణవ్ తేజ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాయి. విడుదలకు ముందే మెగా హీరోలంతా ఈ మూవీ చూసేయగా, తాజాగా బాలయ్యబాబు చూసి ప్రశంసలు గుప్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూసిన బాలయ్య బాబు.. దర్శకుడి ప్రతిభను, నటీనటుల యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. అనంతరం దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ ఫోటో దిగారు. తాజాగా ఆ ఫొటో షేర్ చేస్తూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారని పేర్కొంది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ మూవీ పూర్తికాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఈ కారణంగానే బాలయ్య కోసం '' స్పెషల్ షో వేశారట మైత్రి నిర్మాతలు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రిలీజ్ కంటే ముందే ఉప్పెన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్‌ను క్రియేట్ చేస్తూ రావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ నెల 12న సినిమా విడుదల కాగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sdtj3B

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....