Saturday, 20 February 2021

నితిన్ కోసం మెగా హీరోతో పాటు రాజమౌళి కూడా.. స్కెచ్ పెద్దదే! ఇక మామూలుగా ఉండదేమో..

సాధారణంగా సినిమా ఫంక్షన్స్‌ అన్నింటిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా చేస్తుంటారు. సరిగ్గా సినిమాకు కొన్ని రోజుల ముందు చేసే ఈవెంట్ కాబట్టి ఆ సినిమాపై హైప్ తీసుకురావడంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే ఈ ఈవెంట్లకు పెద్ద పెద్ద గెస్టులు, సెలబ్రిటీలను తీసుకొచ్చి తమ సినిమాపై ఆడియన్స్ దృష్టిపడేలా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే 'చెక్' మూవీ యూనిట్ పక్కా స్కెచ్చేసి , వరుణ్ తేజ్‌లను రంగంలోకి దింపుతోంది. ఇటీవలే 'చెక్' సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు మాదాపూర్ లోని ఎన్ కన్వేషన్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న మేకర్స్.. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రానున్నట్లు తెలిపి ఈవెంట్‌పై ఆసక్తి రేకెత్తించారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి.. పిలవగానే వరుణ్ తేజ్ ఓకే అన్నారట. ఇక నితిన్‌తో 'సై' సినిమా తీసిన రాజమౌళి మరోసారి కోసం ఈ ఈవెంట్‌కి రాబోతున్నారట. RRR మూవీతో ఎంతో బిజీగా ఉన్నా కూడా రాజమౌళి వస్తున్నారంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఏదో కొత్త మ్యాటర్ ఉండే ఉంటుంది అని చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఏదేమైనా ఈ ఆదివారం ఇలా అందరి చూపు 'చెక్'పై పడేలా చేసుకున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించారు. అందాల భామలు రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k8n12o

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....