Wednesday, 17 February 2021

రాధే శ్యామ్ మూవీలో అదే కీలకం.. ఒక్క సెట్ కోసమే కోట్లలో ఖర్చు! ఆసక్తి రేకెత్తిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్

యంగ్ రెబల్ స్టార్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ''. పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా ప్రేమికుల రోజు కానుకగా రిలీజైన `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్`లో ప్రభాస్ లుక్‌తో పాటు పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సెట్‌కి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ రైల్వే స్టేషన్, ట్రైన్ సెట్ కోసం భారీ ఖర్చు చేశారట నిర్మాతలు. మూవీ అవుట్‌పుట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడ్యూసర్స్.. ఒక్క ట్రైన్ సెట్ కోసమే ఏకంగా 1.6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. అంతేకాదు రియాలిటీకి దగ్గరగా ఉండేలా నిర్మించిన ఈ భారీ సెట్ కోసం దాదాపు 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇలాంటి ఎన్నో సెట్‌లను నిర్మించారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే మొదట ట్రైన్ సీన్స్ తోనే పరిచయం అవుతారని.. ఈ ట్రైన్ సీన్స్ కథకు చాలా ముఖ్యమని తెలుస్తోంది. అందుకే ఈ సెట్ పట్ల దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకొని 1970 కాలం నాటి ట్రైన్‌ను, అప్పటి రైల్వేస్టేషన్ వాతావరణాన్ని రియాలిటీకి దగ్గరగా ప్రెజెంట్ చేశారట. రాధే శ్యామ్ మూవీ మొత్తంలో కూడా ట్రైన్ సీక్వెన్సే చాలా కీలకం అనే టాక్ నడుస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌‌లో కనిపించనున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని జూలై 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3av3juz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....