Saturday, 20 February 2021

పవన్ కళ్యాణ్‌కి మాధవీలత లవ్ లెటర్! ఆ వయసులోనే అంటూ సుమ ముందే రహస్యం బయటపెట్టిన బీజేపీ నేత

బీజేపీ నేత, హీరోయిన్ మాధవీలతకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతిష్టం అనే సంగతి మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఆయనపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఈ బ్యూటీఫుల్ లేడీ. గతంలో ఓ సారి పవన్ కళ్యాణ్‌కు రాసిన ప్రేమ కవితను బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె, తాజాగా యాంకర్ సుమ ఎదుట పవన్‌కి రాసిన మరో లవ్ లెటర్ చదివి వినిపించింది. సుమ హోస్ట్‌గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి గెస్టుగా వచ్చిన ఇలా ఓపెన్ అయింది. ప్రోగ్రాం హోస్ట్ చేస్తూ సుమ ఇచ్చే కిక్కేవేరు. పార్టిసిపెంట్స్ గురించి ఏ చిన్న హింట్ దొరికినా తన మాటల గారడీతో ఓ ఆట ఆడేసుకునే సుమ.. మాధవీలత విషయంలో అదే అప్లై చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా సమయంలో ఆయనకు మాధవీలత రాసిన లవ్ లెటర్ బయటపెడుతూ ఆమెతోనే చదివించింది. అంతేకాదు ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని మాధవిని ఊహల్లో తేలేలా చేస్తూ లవ్ లెటర్ లోని మ్యాటర్ చెప్పించింది సుమ. దీంతో కాస్త సిగ్గు పడుతూ ఓపెన్ అయిన మాధవీలత ఆ లెటర్ మొత్తం చదివి వినిపించింది. ''నువ్వెక్కడో ఆకాశంలో తారలా ఉన్నావు. నేనేమో ఒక మామూలు అమ్మాయిని. నీపై ఆశపడటం తప్పే.. అందుకోవడమూ జరగదు. అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఆనందం. ఒకప్పుడు కారణం లేకుండా నిన్ను ద్వేషించా.. నా ఫ్రెండ్స్ అందరితో గొడవపడ్డా.. తర్వాత నువ్వేంటో తెలిశాక ఇష్టం పెరిగి క్లాస్‌లో కూర్చోలేక ఇంటికొచ్చేస్తున్నా. నాకు తెలుసు.. సినిమావాళ్లు అందనంత దూరంలో ఉంటారని. కానీ నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి'' అంటూ సిగ్గు మొగ్గలేసుకుంటూ ఈ లెటర్ చదివింది మాధవీ. తన స్కూల్ ఏజ్‌లో రాసుకున్న ఇలాంటి లెటర్స్ మొత్తం 16 ఉన్నాయని, అందులో ఒకటి మాత్రమే ఇది అని మాధవీలత చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంటే మనకింకా పదిహేను ఎపిసోడ్‌లు కంటిన్యూ అవుతాయన్నమాట అని సుమ కౌంటర్ వేసింది. మొత్తానికైతే ఈ సన్నివేశంతో ఎపిసోడ్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NjFhtU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....