Saturday, 20 February 2021

A1 Express: సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యంగ్ హీరో లేటెస్ట్ మూవీ ''. స్పోర్ట్స్ డ్రామాగా హాకీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తున్నారు. డెన్నిస్‌ జీవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'హిప్ హాప్ త‌మిజ' సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్, పోస్టర్స్, ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కిషన్ 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ లుక్‌లో ఆయన కనిపించనున్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. చిత్రంలో సందీప్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా హాకీ ప్లేయర్స్‌గా ఆకట్టుకోనున్నారట. హాకీ మ్యాచ్ మీదే క్లైమాక్స్ అంతా నడుస్తుందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. సో.. చూడాలి మరి ఈ డిఫరెంట్ మూవీ సందీప్ కేరీర్‌కి ఏ మేర ప్లస్ అవుతుందనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZAkYuD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....