Sunday, 3 May 2020

తెనాలి రంగస్థల కళాకారులకు అండగా.. సినీ రచయిత పెద్ద మనసు

కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీరచయిత సాయిమాధవ్ బుర్రా తన స్వస్థలమైన తెనాలిలో ఆదివారం దాదాపు 300 మంది పేద కళాకారులకు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందించి తన పెద్దమనసును చాటుకున్నారు. తనను ఇంతవాడిని చేసిన రంగస్థలం రుణం కొంతైనా తీర్చుకోవాలనే సత్ సంకల్పంతో ఆయన కొన్ని నెలల క్రితం తెనాలిలో ‘కళలకాణాచి’ అనే సంస్థను స్థాపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పేదకళాకారులను ఆదుకోవడమే ఈ సంస్థ లక్ష్యం. కరోనా విలయం నేపథ్యంలో ఈ సంస్థ ద్వారానే సాయిమాధవ్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. Also Read: దాదాపు మూడు లక్షల పైచిలుకే ఈ కార్యక్రమానికి ఖర్చు చేశామని, పేద కళాకారుల ఆకలి తీర్చడం కోసం ఖర్చుకు వెనుకాడకుండా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సాయిమాధవ్ గారికి తెనాలి కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని ‘కళలకాణాచి’ సంస్థ కార్యదర్శి షేక్ జానీబాషా పేర్కొన్నారు. వందలాదిగా కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, కోశాధికారి ఆరాధ్యుల నాగరాజు, సంస్థ సభ్యులు గోపరాజు విజయ్, వేమూరి విజయభాస్కర్, చార్లీ, భవాని, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో మాటల రచయితగా సత్తా చాటారు సాయిమాధవ్ బుర్రా. అంతకు ముందు ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’, ‘గోపాల గోపాల’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు పనిచేసినా బాలయ్య సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ‘ఖైదీ నెం. 150’, ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’తో పాటు కిందటేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సాయిమాధవ్ డైలాగులు రాశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైలాగ్ రైటర్‌గా కొనసాగుతోన్న సాయిమాధవ్.. ఇప్పుడు రాజమౌళి ‘RRR’ సినిమాకు పనిచేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SyWA9I

No comments:

Post a Comment

'Aamir And I Are Still Very Close'

'After being married for almost 18 years, and since there was never any rancour between us, we are still very close, as parents of Azad,...