సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా!! పౌరుషం ఆయుధం.. పోరులో జీవితం.. కైవసం కావడం కష్టమా!! లోకమే బానిసై చేయదా ఊడిగం.. శాశనం దాటడం సఖ్యమా!! సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా!! సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఆయన్ని స్మరించుకుంటూ వివాదాల దర్శకుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుని ఈ పాట పాడి వినిపించారు. అంతేకాదు.. ఆయన మరణంపై తనదైన శైలిలో స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారా వరుస ఆడియోలను వదిలారు. ‘‘సిరివెన్నెల రాసిన.. ‘సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా’ పదాలు నన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఈ పాటలో ఉన్న పదాలే నా జీవితం. ఇలాంటి అద్భుతమైన పదాలు రాసి.. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్లి ఉంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హాయ్ చెప్పండి. నేను పాపాలు చేసి నరకానికి వెళ్లాను.. ఒకవేళ యముడి చట్టాల్లో ఏదైనా అకౌంట్ మిస్ అయ్యి.. పొరపాటున నేను స్వర్గానికి వస్తే.. మీరు నాతో కలిసి ఎప్పుడూ వోడ్కా తాగలేదు.. అక్కడ మనిద్దరం కలిసి ఓ పెగ్గు అమృతం వేద్దాం’ అంటూ సిరివెన్నెల మరణంపై వ్యగ్యంగా ఆడియో విడుదల చేశారు వర్మ. అయితే వర్మ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. మరణంలో కూడా నీ వోడ్కా పిచ్చిని వదల్లేదుగా.. ఇక్కడ కూడా వ్యగ్యం ఏంటని కొందరంటే.. నీ క్రియేటివిటీకి దండంరా సామీ అంటూ దండాలు పెట్టేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pkWdyS
No comments:
Post a Comment