Wednesday, 1 December 2021

లాక్డౌన్‌లో అలాంటి పనులు.. ఇప్పుడు లిక్కర్ షాపులు.. కొత్త బిజినెస్‌పై కమెడియన్ రఘు

బుల్లితెరపై వెండితెరపై ఫుల్ ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో విలన్, కమెడియన్ పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక బుల్లితెరపై సంచలనంగా మారిన జబర్దస్త్ షోలోనూ కనిపించాడు. ఒకప్పుడు ఈ షో సీనియర్ ఆర్టిస్ట్‌లతోనే నడిచింది. అక్కడ రోలర్ రఘు అనే పేరుతో స్కిట్లు చేశాడు. బాగానే బిజీగా మారిపోయాడు. మధ్యలో అలీతో జాలీగా అనే షోలోనూ రచ్చ చేశాడు. అయితే రఘు ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నాడు అందుకు ఇప్పుడు అతని దృష్టి వ్యాపారాల మీద పడ్డట్టుంది. లాక్డౌన్‌లొ చిన్నగా మొదలు పెట్టిన వ్యాపారమే.. పది ఎకరాలు లీజుకు తీసుకుని చేసేంతలా ఎదిగిందట. లాక్డౌన్ వల్ల పరిస్థితి బాగా లేకుండా పోయిందట.. ఏం చేయాలో అర్థం కాక.. ఇంటి చుట్టూ కూరగాయలు పెట్టాడట. ఆర్గానిక్‌గా పండించాడట. చాలా మంచిగా పండాయట. ఇదేదో బాగుందని పది ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ ఇప్పుడు పండిస్తున్నాడట. మంచిగనే నడుస్తుండట. ఇంతలోనే తన ఫ్రెండ్స్ సాయి రామ్ రెడ్డి, హరినాథ రెడ్డి అని అభినవ్ లిక్కర్ పేరుతో టెండర్ వేశాం. ఇలా వైన్ షాపులకు టెండర్ పడుతుందట వేద్దామని అన్నారు. సరే ఇందులో కూడా మన లక్ ఎలా ఉందో అని ట్రై చేశాం. నాలుగింటికి వేస్తే రెండు దుకాణాలు నాకే వచ్చాయి అంటూ రఘు చెప్పుకొచ్చాడు. ఈరోజు మంచి రోజు అని ఈ రోజే మందు దుకాణాలను ప్రారంభించాడట. మొత్తానికి ఈ కమెడియన్ మాత్రం బిజినెస్‌లోకి దూసుకుపోతోన్నాడు. చూస్తుంటే సినీ కెరీర్‌ను కూడా పక్కన పెట్టేసి బిజినెస్ మెన్‌గా అవతరించేట్టున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rsMXvy

No comments:

Post a Comment

'Nowhere In Empuraan Did They Mention Godhra'

'They just showed riots created by some political party. They never mentioned the name of the place or the political party.' from ...