మహేష్ బాబు ఫ్యామిలీలు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మహర్షి సినిమా నుంచి ఈ రెండు ఫ్యామిలీలు కలిసిమెలిసి తిరుగుతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా కూతురు సితార, వంశీ పైడిపల్లి డాటర్ ఆద్యలు కలిసి ఏకంగా యూట్యూబ్‌లో చానెల్ పెట్టేసి రకరకాల వీడియోలను చేస్తుంటారు. ఈ ఇద్దరు పిల్లలు కలిసి సరిలేరు నీకెవ్వరు సమయంలో మహేష్ బాబును ఇంటర్వ్యూ కూడా చేసేశారు. ఇక ఈ రెండు ఫ్యామిలీలు కలిసి తాజాగా వీకెండ్ పార్టీని సెలెబ్రేట్ చేసుకున్నాయి. మామూలుగా అయితే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి మధ్య దూరం పెరిగిందనే టాక్ ఆ మధ్య వచ్చింది. ఎందుకంటే మహర్షి సినిమా తరువాత మళ్లీ వెంటనే మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి ఓ సినిమాను చేయాల్సింది. కానీ దిల్ రాజు రెమ్యూనరేషన్ విషయంలో కాస్త బెట్టు చేయడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో మహేష్, వంశీల మధ్య దూరం పెరిగిందనే టాక్ వచ్చింది. కానీ కొన్ని రోజుల తరువాత నమ్రతతో వంశీ పైడిపల్లి ఓ ఫంక్షన్‌లో కలిసి మాట్లాడాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఇంకా ఉందని అందరికీ అర్థమైంది. సర్కారు వారి పాట గోవా షెడ్యూల్‌లో భాగంగా మహేష్ బాబు ఫ్యామిలీతో పాటుగా వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కూడా వెళ్లింది. అలా మొత్తానికి అక్కడ కూడా కలిసే ఎంజాయ్ చేశారు. ఇక నిన్న రాత్రి కూడా అందరూ కలిసి పార్టీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32QIGrg
No comments:
Post a Comment