యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ కేవలం నటనకే పరిమితం కాలేదు. నిజానికి ఆమె సంగీత దర్శకురాలిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అటు పిమ్మట హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈమె స్పీడుకు బ్రేకులేసింది ఎవరో తెలుసా.. ఆమె ప్రేమ. మైకేల్ కోర్సల్‌తో పీకల లోతు ప్రేమలో మునిగిన ఈ అమ్మడు అప్పట్లో కెరీర్‌పై ఫోకస్ పెట్టలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. సరే! పెళ్లి చేసుకుని సెటిలైపోతుందని అందరూ అనుకున్నారు. అయితే మైకేల్‌కు శ్రుతికి ఏదో మనస్పర్దలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్రుతి శాంతను హజారికాతో రిలేషన్‌లో ఉంది. తనొక డూడెల్ ఆర్టిస్ట్.. అలాగే ఆర్గానిక్ సంగీత పరికరాలను సేకరిస్తుంటాడు. లవ్ బ్రేకప్ నుంచి నేర్చుకున్న పాఠాలేమో కానీ ఒకవైపు సినిమాలను, మరో వైపు లవ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగిపోతుంది. ఇప్పుడు శాంతను తన బాయ్‌ఫ్రెండ్ అని ఎక్కడా చెప్పలేదు. అలా అని అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉండే సానిహిత్యం ఫొటోలను వీడియోలను చూస్తే అలా అనిపిస్తుంది. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఓ సాంగ్ ప్లే అవుతుంది. అందులో శ్రుతి హాసన్ వెనుక శాంతను తిరుగుతున్నాడు. అతను శ్రుతి హాసన్ పక్కకు వచ్చి నిలబడగానే తన బుగ్గను అతని బుగ్గకు ఆనించుకుని ముద్దు పెట్టించుకుని కిసుక్కున నవ్వేసింది మన చెన్నై సంద్రం. అతను నీకు ప్రియుడే కానీ, కెమెరాల ముందు అలా రెచ్చిపోవడమేంటో, ఎందుకో.. అని చెవులు కొరుక్కుంటున్నాయి సినీ వర్గాలు. ఇక శ్రుతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్, లాభం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సలార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఖాళీ సమయాల్లో తన బాయ్‌ఫ్రెండ్ హజరికాతో కలిసి డూడెల్ ఆర్ట్స్‌లో పాల్గొంటుంది. అలాగే తన అభిరుచికి తగినట్లు ప్రైవేట్ ఆల్బమ్స్ డిజైన్ చేసుకుంటోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3djzw8L
No comments:
Post a Comment