టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా సూపర్ హిట్ అయినా కూడా ప్రియాంక జవాల్కర్‌కు అంతగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఈ ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతోంది. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు అనే సినిమాలతో హిట్లు కొట్టేసింది. ఇక ఇప్పుడు మళ్లీ అనే సినిమాతో అందరినీ పలకరించేందుకు రెడీ అయింది. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా గమనం చిత్రాన్ని నిర్మించారు. లేడీ డైరెక్టర్ సంజనా రావు తెరకెక్కించిన ఈ గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక జవాల్కర్ మీడియాతో ముచ్చటించింది. ఇందులో భాగంగా కమర్షియల్ సినిమాల గురించి కామెంట్ చేసింది. గమనం సినిమాలో నటనకు ఎక్కువగా స్కోప్ ఉంటుందని ప్రియాంక తెలిపింది. డైలాగ్స్ ఎక్కువగా ఉండవని, కళ్లతోనే నటించాల్సి ఉంటుందని అది చాలా కష్టంగానే అనిపించిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం వెనుక కారణం కూడా ఉందని అంది. ఇలా నటన ప్రాధాన్యమున్న సినిమాలు, పాత్రలు చేస్తే మిగతా దర్శకులు కూడా అవకాశాలు ఇస్తారు.. అసలే నన్ను చూసి అందరూ కమర్షియల్ చిత్రాలకు మాత్రమే పనికొస్తానని అనుకుంటారని ప్రియాంక చెప్పుకొచ్చింది. విలేజ్ గర్ల్ పాత్రలు ఇవ్వమని అడిగినా కూడా తెల్లగా ఉన్నావ్ వద్దని అంటారట. అలా మొత్తానికి ప్రియాంక మాత్రం పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలు, నటనను మెరుగు పరుచుకునే పాత్రలను పోషించాలని అనుకున్నట్టు కనిపిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GgOmte
No comments:
Post a Comment