సోషల్ మీడియాలో స్పందించే తీరుకు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ కొంత మంది అమ్మాయిలు, ఆడవాళ్లకు మాత్రం దారి చూపిస్తోంది. సమాజంలో స్ట్రీలపై ఉన్న వివక్షను వేలెత్తి చూపిస్తుంటుంది. ఆడవాళ్లపై జరిగే వేధింపులపై చిన్మయి నిలదీస్తుంటుంది. ఇక అమ్మాయిల పెళ్లిళ్ల విషయాల్లో అయితే చిన్మయి సలహాలు ఇస్తుంటుంది. అయితే ఇలా అమ్మాయిలకు సలహాలు ఇస్తుంటే కొంతమంది మగాళ్లు, అబ్బాయిలకు మాత్రం అవి నచ్చడం లేదు. దీంతో చిన్మయిని దారుణమైన పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. వాటిపై చిన్మయి స్పందించింది. ‘డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి ఓ అవగాహన కార్యక్రమం ఉందని అనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి.. ఇవి చేయాలి.. ఇవి చేయొద్దు అని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి బండిని నడుపుతున్నారు అని కాదు. ఆ అవగాహన కార్యక్రమం ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్టు లెక్క. నేను పెడుతున్న స్టోరీస్ చూసి ఎన్నారైస్ అందరూ అలా కాదు.. జనరలైజ్ చేయకే ల** అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతురన్నాను. తద్వారా మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని. నాకేమో ఈ ఫారిన్ సంబంధం మోహం ఎప్పటికీ అర్థం కాదు. తమ బిడ్డను గౌరవంగా బతికే చాన్స్ ఇవ్వరు.. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్చ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్ర్యంగా బతకనివ్వరు. అవన్నీ అయితే ఆడవాళ్లకు అవగాహన, ఏజెన్సీ వస్తే వేరే కాస్ట్ వాళ్లని పెళ్లి చేసుకుంటారని భయం. ఫోర్స్ చేసి వెధవనైనా పర్లేదు సొంత క్యాస్ట్‌లో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. అందరినీ జనరలైజ్ చేస్తున్నావ్.. కొందరు ఆడవాళ్లు కూడా నువ్ చెప్పేదానికి అంగీకరించడం లేదు అని చెబుతున్న మనుషులకి.. ఈ పితృస్వామ్య వ్యవస్థను ఇంకా కొంత మంది మహిళలు సమర్థిస్తూనే ఉన్నారు. ఇంకా కొంత మంది ఆడవాళ్లు ఈ కట్నాలు, వేధింపులపై మాట్లాడని వారున్నారు. ఈ స్టోరీస్ చూసి ఐ మంది అమ్మాయిలైనా సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే కూడా అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే.. హిస్టారికల్‌గా చూస్తే కూడా మనుషులకి కోపం వస్తుంది. బాలికల విద్య నుంచి సతీ సహగమనం వంటి చెత్త సంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతీ సారి ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు. అక్కాచెల్లెళ్లున్న మగవాళ్లందరూ కూడా తమ తమ సోదరీమణులను ఇలానే చేస్తారా? చేయనంటే.. వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే.. కోప్పడండి.. మీ ఈగోలను శాటిఫై చేసి మిమ్మల్ని శాంతపరిచేందుకు నేను ఇక్కడికి రాలేదు’ అంటూ చిన్మయి స్పందించింది. అరేంజ్ మ్యారేజ్ అనేది పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది.. అంతే కాకుండా అందులో ఆడదాని శరీరం కూడా వేధింపులకు గురవుతోందని చిన్మయి తెలిపింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rEnyyW
No comments:
Post a Comment