Sunday, 5 December 2021

‘నా కోసం’ అంటూ కృతి శెట్టిపై చైతూ ప్రేమ.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు

మనం సినిమాలో , కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైసూర్‌లో గత నెలలో మొదలైన సుధీర్ఘమైన ఈ షెడ్యూల్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. మొదటి పాట లడ్డుండా అంటూ బంగార్రాజు సరసాల గురించి చెబితే.. ఈ రెండో పాటలో నాగ చైతన్య ప్రేమ కథను వినిపించారు. ఇప్పటికే వదిలిన సెకండ్ సింగిల్ ‘నా కోసం’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పేశాడు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది. నాగ చైతన్య, క‌ృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు. ఆ ఫ్రేమ్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GgXb6o

No comments:

Post a Comment

'Everything Cannot Just Be Box Office'

'Failure teach you far more than your successes do you.' from rediff Top Interviews https://ift.tt/uoWzXqp