ఇంట్లో ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది. ఉపాసన సోదరి పెళ్లి సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్-అమన్ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక అనుష్ పాల చెన్నైకి వెళ్లి సెటిల్ అవ్వడంతో ఉపాసన తెగ ఫీలైంది. నన్ను విడిచి వెళ్లిపోయావ్ అంటూ ఉపాసన ఎమోషనల్ అయింది. ఇక అనుష్ పాల పెళ్లికి సంబంధించిన పనులు ఆరంభమయ్యాయి. గత నెలలో అనుష్ పాల పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమైతే.. అనుష్ పాల మాత్రం మాల్దీవుల్లో బ్యాచ్‌లర్ పార్టీని ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం అనుష్ పాల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కామినేని కుటుంబం అంతా కూడా పాల్గొన్నట్టుంది. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కూడా మెరిశాడు. తన మరదలి పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ రచ్చ చేస్తున్నాడు. అనుష్ పాల పెళ్లి కోసం రామ్ చరణ్ ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక తన పెళ్లి సందర్బంగా అనుష్ పాల.. నిన్న నెట్టింట్లో మెరిసింది. ఉపాసనతో కలిసి సింహాలను దత్తత తీసుకుంది అనుష్ పాల. అలా ఈ సిస్టర్స్ ఇద్దరూ కూడా నెట్టింట్లో సందడి చేశారు. ఇప్పుడేమో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో అనుష్ పాల, ఉపాసన సందడి చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pmP2pS
No comments:
Post a Comment