Monday, 20 September 2021

Sai Dharam Tej: పూర్తిగా కోలుకున్న సాయితేజ్‌.. డాక్ట‌ర్స్ ఏం చెబుతున్నారంటే?

మెగా కుటుంబానికి చెందిన యువ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం మెరుగ‌వుతుంది. కొన్ని రోజుల ముందు బైక్ యాక్సిడెంట్ గురై అపోలో హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్నసాయిధ‌ర‌మ్‌ పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో ఆసుప్ర‌తి వ‌ర్గాలు తెలిపాయి. సాయిధ‌ర‌మ్‌ను ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి మార్చామ‌ని, ఇప్పుడాయ‌న సొంతంగానే శ్వాస తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఇత‌రుల‌తో తేజ్ మాట్లాడుతున్నార‌ని, రెండు మూడు రోజుల్లో ఆయ‌న్ని డిశ్చార్జ్ చేయ‌వ‌చ్చున‌ని కూడా హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. వినాయ‌క చ‌వితి రోజు రాత్రి ఎనిమిది గంట‌ల‌కు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్‌-ఐకియా మార్గంలో బైక్‌పై వేగంగా వెళుతున్నారు. ఆ స‌మ‌యంలో బైక్ స్కిడ్ కావ‌డంతో ఆయ‌న‌కు గాయాల‌య్యాయి. స్పృహ కోల్పోయారు. వెంట‌నే అక్కడున్నవారు తేజ్‌ను మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌కు పంపారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స చేశారు. అక్క‌డ నుంచి తేజ్‌ను అపోలో హాస్పిట‌ల్‌కు షిఫ్ట్ చేశారు. న‌లుగురు డాక్ట‌ర్స్ బృందం తేజ్ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించారు. కాల‌ర్ బోన్ విరిగి ఉన్న‌ట్లు గుర్తించిన డాక్ట‌ర్స్ ఆప‌రేష‌న్ చేశారు. దాదాపు ప‌ది రోజుల‌కు పైగా వెంటిలేట‌ర్‌పైనే ఉన్న తేజ్‌ను ఇప్పుడు స్పెష‌ల్ రూమ్‌కు మార్చారు. సినిమాల విష‌యానికి వ‌స్తే, దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన ‘రిప‌బ్లిక్‌’ మూవీ అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. సెన్సార్ స‌హా సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hTDZ4S

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....