
- Ravi Teja: 154వ చిత్రం మరో రేంజ్‌లో రూపొందనుందని సినీ వర్గాల టాక్. డైరెక్టర్ బాబి తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. సినిమాలో ప్రధానంగా కనిపించే ఈ పాత్రలో మరో స్టార్ హీరోను నటింప చేయడానికి డైరెక్టర్ బాబి ప్లాన్ చేసినట్లు టాక్. అందులో భాగంగా మాస్ మహారాజా రవితేజను చిరు 154లో నటింప చేయడానికి బాబి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతా ఓకే అయితే మూడోసారి చిరంజీవి, రవితేజ ప్రేక్షకులను మురిపించడం ఖాయమనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రామ్‌చరణ్ ఎక్కువగా నటిస్తున్నారు. మెగా హీరోల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో ఎవరినైనా చిరంజీవి సినిమాలో నటింప చేయవచ్చు అయితే డైరెక్టర్ బాబి తన ప్లాన్‌ను మార్చి మరో హీరోను నటింప చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే రవితేజతో తనుకున్న అనుబంధాన్ని ఉపయోగించుకుని ఈ సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేశాడట. అలాగే మెగాస్టార్ చిరంజీవి అంటే రవితేజకు అభిమానం. అన్నయ్య అని చిరుని రవితేజ సంబోధిస్తుంటాడు. ఇది వరకు అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇద్దరి తమ్ముళ్లలో ఒకరిగా రవితేజ కనిపించారు. అలాగే శంకర్ దాదా జిందాబాద్‌లోనూ ఓ పాటలో మెరిశారు రవితేజ. పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందనిపిస్తే, మంచి రెమ్యునరేషన్ కుదిరితే.. చిరంజీవితో రవితేజ కలిసి నటిస్తాడనడంలో సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3F43v0Y
No comments:
Post a Comment