- Pushpa: ఐకాన్ స్టార్ ఎన్నో ఆశలతో చేస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారే అవకాశం ఉందంటూ వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేద్దామనుకుంటే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మారుతుందని టాక్. అల్లు అర్జున్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ. డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో సినిమాను వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. మంచి రిలీజ్ డేట్ కావడంతో సినిమా ఏమాత్రం బావున్నా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను అలరించడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి. అయితే ఇప్పుడు కాస్త లెక్కమారిందని టాక్. వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ సినిమాలు వరుసగా థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్‌లతో డైరెక్టర్ కబీర్ ఖాన్ చేసిన 83 సినిమాను క్రిస్మస్‌కు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. భారీ బాలీవుడ్ తారాణం ఉండటంతో బాలీవుడ్ వర్గాలు పుష్ప కంటే 83 వైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. దీని వల్ల పుష్ప మేకర్స్ ఓ వారం ముందుగానే థియేటర్స్‌లోకి రావాలనుకంటున్నారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు, డిసెంబర్ 24 విడుదల చేయాలనుకున్న పుష్పను.. డిసెంబర్ 17నే విడుదల చేస్తారట. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమాను సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా.. మలయాళ విలక్షణ హీరో ఫహాద్ ఫాజిల్ ఇందులో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో బన్ని పాత్రకు సంబంధించిన టీజర్, దాక్కో దాక్కో మేక సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇప్పుడు దసరా సందర్భంగా మరో పాటను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3icN1Kl
No comments:
Post a Comment