తమిళ హాస్య నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. అయితే గత కొలంగా అవకాశాలు రాకపోవడం.. ఇతర కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని చిక్కుల్లోపడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనని మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాక.. సింగముత్తుపై ఆయన క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగముత్తు తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలునే విక్రయించారు అని వాళ్లు కోర్టుకు తెలిపారు. పన్ను ఎగవేయడం కోసమే ఆయన సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పటిసరిగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి నాగరాజన్ తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3omIed7
No comments:
Post a Comment