మెగా మేనల్లుడు హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ పాత్ర పోషించారు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్ర ప్రమోషన్స్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 1న) ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒకరోజు ముందుగానే ఈ మూవీ చూసి సినిమా ఎలా ఉందనే విషయమై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాచురల్ స్టార్ నాని ఈ సినిమాపై, సాయి తేజ్ నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే స్పందిస్తూ 'రిపబ్లిక్' ఎలా ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''రిపబ్లిక్ సినిమా దేవ కట్టా మరో ప్రస్థానం అవుతుంది. గత రాత్రి ఈ సినిమా చూశా. రియల్లీ మైండ్ బ్లోయింగ్. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక మీ స్పందన ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నా'' అని పేర్కొన్నారు స్మిత. సాయి తేజ్ సినిమాపై ఇలా సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా స్పందిస్తూ ప్రశంసలు గుప్పిస్తుండటం చిత్ర ఓపెనింగ్‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన తేజ్ ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే ఈ సినిమా రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. సాయి తేజ్ అభిమానులు ఈ సినిమా సక్సెస్ కావాలని కోటి ఆశలతో ఉన్నారు. ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ టాక్ పరంగా అయితే సినిమా భేష్ అనిపించుకుందని చెప్పుకోవచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wu42rH
No comments:
Post a Comment