
దాదాపు నాలుగు పదులకు దగ్గరవుతున్న బ్యూటీ ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే ఒకాయన మాత్రం అనుష్క పెళ్లి తేదిని ఖరారు చేసేశాడు. ఎవరా వ్యక్తి? అనే అనుమానం రాక మానదు. ఆయనెవరో కాదు.. సెలబ్రిటీలకు జ్యోతిష్కం చెప్పే పండిట జగన్నాథ్ గురూజీ. ఆయన చెప్పేదాని ప్రకారం త్వరలోనే అనుష్క పెళ్లి చేసుకోనుందట. 2023 జనవరిలోపు అనుష్క పెళ్లి జరుగుతుందని సదరు పండితుడి మాట. అనుష్క జాతక చక్రంలో పెళ్లి ముచ్చట ఉందని ఆయన ఘంటా పథంగా చెబుతున్నారు. పెరుగుతున్న వయసు, సినిమాలు తప్ప మరో ధ్యాసగా అనుష్క లేకపోవడంతో ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా రకాలైన వార్తలే వినిపించాయి. ఆమె పెళ్లి చేసుకోదని కొందరు అన్నారు. ఒకానొక దశలో ఆమె హీరో ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటుందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాము మంచి స్నేహితులమంటూ ఆ వార్తలను తోసిపుచ్చారు. రీసెంట్ టైమ్‌లోనూ రాఘవేంద్రరావు తనయుడు కె.ఎస్.ప్రకాశ్‌ను అనుష్క పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయాయి. సైజ్ జీరో సమయంలో అనుష్క విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత ఎందుకనో ఆమె బరువు తగ్గలేకపోయింది. గత ఏడాది అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అనుష్క మరో సినిమాలో నటించలేదు. పలానా సినిమాలో అనుష్క నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ, అధికారిక ప్రకటన రావడం లేదు. అనుష్క బరువు తగ్గే పనిలో ఉందని మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతుంది. పెళ్లి కోసమే ఈ బ్యూటీ బరువు తగ్గుతుందని కూడా మరికొందరు అంటున్నారు. ఏదేమైనా అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్యుడు చెప్పే జోస్యం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ya3YOy
No comments:
Post a Comment