Tuesday, 28 September 2021

Pawan Kalyan ఓ సైకో.. కట్టె పుల్లకు చీర కట్టినా ఎత్తి చూసే రకం.. పోసాని వ్యాఖ్యలతో దుమ్ము దుమారం

'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రి జగన్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో వైసీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు వైసీపీ నాయకులు పవన్‌పై విరుచుకుపడుతుండగా.. సినీ రచయిత, దర్శకుడు, నటుడు ఎంటరై పవన్ మాట్లాడిన తీరుపై ధ్వజమెత్తారు. జగన్‌తో నువ్వు పోల్చుకోలేవు అని మండిపడుతూ పంజాబీ అమ్మాయి ఇష్యూ తెరపైకి తెచ్చారు. దీంతో రచ్చ రెట్టింపయింది. ఈ నేపథ్యంలో పవన్‌ ఫ్యాన్స్‌ తనని టార్గెట్‌ చేసి బెదిరింపులకు దిగారని, తనను తన భార్య పక్కింటి వాడితో రిలేషన్ పెట్టుకుందంటూ ఇష్యూలోకి లాగి వ్యక్తిగత దూషణకు దిగారని ఆరోపిస్తూ పోసాని మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ ఫ్యాన్స్‌ గ్రూపులు గ్రూపులుగా బెదిరింపులకు దిగుతున్నారని, కొన్ని వేల ఫోన్స్, మెసేజీలు వస్తున్నాయని చెబుతూ ఫైర్ అయ్యారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ''నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబం కూడా అంతే గొప్ప. నువ్వు నీ ఫ్యాన్స్‌ని అడ్డుపెట్టుకొని నన్ను టార్గెట్ చేయి ఒప్పుకుంటా.. కానీ నా కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నావ్. విమర్శించడం వేరు, తిట్టుకోవడం వేరు. అసలు విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. అబద్దం వల్ల సమాజం పాడవుతుంది. తిట్టు వల్ల పాడవదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్‌ కాను. నన్ను చంపిస్తావా.. నేను రెడీ. నా డెడ్‌ బాడీ కూడా నిన్ను వదలదు'' అన్నారు పోసాని. ఇక మరోసారి పంజాబీ అమ్మాయి మాట తీసిన పోసాని.. పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా? ఆమెకు కడుపు చేసి డబ్బులిచ్చి పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడివా.. బ్రోకర్ గాడివి నువ్వు. లోఫర్ గాడివి నువ్వు. ఎంత మంది ఆడపిల్లల జీవితాలు పాడుచేసిన నువ్వు మా ఇళ్లపై పెడతావా? మా కుటుంబం గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. నేను లోలోపల ఏడుస్తున్నా. ఇవ్వాళ నా భార్య అయింది. రేపు మీ భార్య అవుతుంది. ఊరుకుంటారా? ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రావడం? సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా. ఎలక్షన్‌లో ఓడిపోయిన దగ్గర్నుంచి పవన్ సైకోలా తయారయ్యాడు. ఎవరేమన్నా ఫ్యాన్స్‌తో టార్గెట్ చేస్తున్నాడు. నీకూ ఓ ఆడపిల్ల ఉంది. ఆమె పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకో నేను చెబుతున్నా.. రక్త కన్నీరు పెట్టుకుంటావ్. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించడం. పుల్లకు చీర కట్టినా ఆ పిల్ల ఎవరు అని ఎత్తి చూసే రకం నువ్వు'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పోసాని చేసిన ఈ కామెంట్స్‌తో పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోసానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పోసాని మాట్లాడిన మాటలను ఖండిస్తూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. పవన్‌ని అలా తిట్టినందుకు గాను కొన్ని చోట్ల పోసానిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ohQWJK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....