ప్రేమ పక్షులు నయనతార- విగ్నేష్ శివన్ జోడీ తిరుమలలో సందడి చేసింది. నయనతారతో పాటు ఆమె కాబోయే భర్త చేరుకొని నేటి (సోమవారం) ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిద్దరినీ ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఇకపోతే ఆలయం వెలుపల నయనతారని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత , డైరెక్టర్ సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమల వీధుల్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. స్వామివారి సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ పెంచుకున్న దళపతి విజయ్‌తో కలిసి దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దళపతి 66 అంటూ ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలో హీరోయిన్, ఇతర తారాగణం వివరాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి దిల్ రాజు తిరుమల వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y1BOW4
No comments:
Post a Comment