Tuesday, 28 September 2021

మన జర్నీ ఆగొద్దు.. మా ప్రయాణం నిలిచిపోతుందని ఎంతో ఫీల్ అయ్యా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్

నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో , సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై నాగ చైతన్య మాట్లాడుతూ.. ''నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు? అని తెలుసుకుంటా. వాటిని బట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌ స్టోరీ’ విడుదల కావడంతో ఎంతో ఆనందించా. థియేటర్‌కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరీ సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. ఈ సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్‌. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరీ హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uo00xr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....