Sunday, 26 September 2021

ఇండస్ట్రీలో చలనం!.. పవన్ కళ్యాణ్ జెన్యూన్‌గా మాట్లాడారు.. నాని ట్వీట్ వైరల్

సాయి ధరమ్ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ఏపీలో ప్రకంపనలు సృస్టిస్తున్నాయి. సినిమా ఈవెంట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, లేవనెత్తిన అంశాలు, చిత్రసీమకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిన మాటలతో అది రాజకీయ సభను తలపించింది. ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఏకిపారేశాడు. అదే సమయంలో చిత్రపరిశ్రమ, అందులోని పెద్దలను కూడా మందలించాడు. ఇలాంటి సమయంలోనే అందరూ ఏకత్రాటిపైకి రావాలని పిలుపునిచ్చాడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగం సమయంలో మధ్యలో హీరో గురించి కూడా ప్రస్థావించాడు. టక్ జగదీష్ సమయంలో.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా నానిని ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇకపై సినిమాలు థియేటర్లో విడుదల చేయనివ్వం, బ్యాన్ చేస్తామని అన్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుకు చేశారు. థియేటర్లు లేక ఏదో ఆయన సినిమాను ఓటీటీకి ఇస్తే అంతలా ఎందుకు ఆయన్ను అన్నారు. మీకు దమ్ముంటే ఏపీ ప్రభుత్వాన్ని థియేటర్ల గురించి అడగొచ్చు కదా? అని పవన్ కళ్యాణ్ అందరికీ చురకలు అంటించారు. సినిమా ఇండస్ట్రీలోని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జోడింంచాడు. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి గురించి మాట్లాడారు. అందరూ ఒక్క మాట మీద నిలబడాలి.. ప్రాధేయపడితే పనులు జరగవు..అది మన హక్కు.. అడగాలి ప్రశ్నించాలి.. ఎదురునిలబడాలి అని అందరిలోనూ ఉత్తేజాన్ని నింపాడు. కానీ ఇంత వరకు సినీ ఇండస్ట్రీ నుంచి ఓ ఒక్కరూ స్పందించలేదు. రియాక్ట్ అయిన మొదటి హీరోగా నాని ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ సర్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు ఎలా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేస్తే..ఆయన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కరెక్ట్ మాట్లాడారు. దానిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా సభ్యుడిగా గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ వేశాడు. ఇక నాని ఇలా స్పందించడంతో నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నానిని ఆకాశానికెత్తేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ucUBJG

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O