Wednesday 29 September 2021

Love Story: ముద్దు సీన్‌పై సాయి పల్లవి క్లారిటీ.. అలా కానిచ్చేశారు! అసలు విషయం రివీల్

అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంది. 'లవ్ స్టోరీ' సినిమాలో తనదైన స్టెప్పులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి థియేటర్స్‌లో ఈలల మోత మోగించింది. వెండితెరపై నాగ చైతన్య- సాయి పల్లవి కెమిస్ట్రీ చూసి మురిసిపోయారు తెలుగు ప్రేక్షకులు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం, అక్కడక్కడా షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ని మైమరిపించాయి. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీతో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. తన రెగ్యులర్ పంథానే ఫాలో అవుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ముందునుంచి చర్చల్లో నిలుస్తున్న అంశం నాగ చైతన్య- సాయి పల్లవి . నిజానికి ముద్దు సీన్లంటే ఎంతో దూరం ఉండే సాయి పల్లవి ఈ కిస్ ఎలా ఒప్పుకుంది? అనే టాక్ జనాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి. తాను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాల్లో నటించని తనను శేఖర్ కమ్ముల ఇబ్బంది పెట్టలేదని, కథ ప్రకారం ఆ సీన్ ఉండాలి కాబట్టి కెమెరామెన్ ట్రిక్‌తో ముద్దు సన్నివేశం కంప్లీట్ చేసి ఆ ఫీల్ తెప్పించారని ఆమె చెప్పింది. ఇకపై కూడా ముద్దు సన్నివేశాల్లో నటించనని సాయి పల్లవి చెప్పడం గమనార్హం. ఇకపోతే థియేటర్స్‌లో 'లవ్ స్టోరీ' కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. ఈ విజయం పట్ల చిత్రయూనిట్ చాలా ఆనందంగా ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3imEQLt

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz