అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'లవ్ స్టోరీ' సినిమా. కరోనా తర్వాత థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలకు తెర దించుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని సెంటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ బ్యూటిఫుల్ చూసిన పలువురు సినీ ప్రముఖులు చైతూ, సాయి పల్లవి నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ విజయంతో ఇటు నటీనటులతో పాటు అటు సాంకేతిక వర్గం ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సక్సెస్ సంబరాలు జరుపుకుంది. , సాయి పల్లవి సహా ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ మేరకు అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిపోయి నవ్వులు చిందించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్‌ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. ''లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. సూపర్ ఫ్రేమ్, అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. లవ్ స్టోరీ రన్ చూస్తుంటే ఈ సినిమాకు భారీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చైతూ కెరీర్‌కి ఈ మూవీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ijZgor
No comments:
Post a Comment