ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, ఇతర నాయకులపై రీసెంట్‌గా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని ఫైర్ అయ్యారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌పై పరుష పదజాలంతో పోసాని విరుచుకుపడ్డారు. తమ నాయకుడిని పరుషంగా మాట్లాడినందుకు పోసానిపై జనసేన నాయకులు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కొందరు అయితే ఆయనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయన్ని ఇంటికి పంపేశారు. పోసానిపై దాడికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో తెలంగాణ జనసేన ఇంచార్జి శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే పోసాని కృష్ణమురళిపై కేసుని నమోదు చేశారు. ఇలాంటి పరుష పదజాలం వాడినందుకు పర్యవసానాలు ఎదుర్కోవాలని జనసేన నాయకులు పోసాని కృష్ణమురళికి వార్నింగ్ ఇచ్చారు. తాజా సమాచారం మేరకు ఇప్పుడు జనసేన తెలంగాణ మహిళా విభాగానికి చెందిన నేతలు సైబరాబాద్ కమీషనర్‌కు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేయబోతున్నారు. మంగళవారం ప్రెస్‌మీట్ అనంతరం పోసానిపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నించారు. దానిపై ఆయన స్పందిస్తూ తనకు పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే పవన్‌కళ్యాణ్ బాధ్యత వహించాలన్నారు. అంతే కాకుండా బుధవారం తాను కూడా పవన్‌కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39K1aKi
No comments:
Post a Comment