Thursday, 30 September 2021

ఆడవాళ్ల గురించి ఆలోచించేదెవరు?.. అంతా అలాంటి వారే.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్

ట్వీట్లు, ఆమె వేసే కౌంటర్లు, పరోక్షంగా చెప్పే మాటలు, ఇచ్చే హింట్లు ఎవ్వరికీ అర్థం కావు. ఆమెకు ట్వీట్లు వేయడం, వెంటనే వాటిని డిలీట్ చేయడం అలవాటే. ఆమె గురూజీ అంటూ ట్వీట్లు పరోక్షంగా వేయడం, ఇండస్ట్రీలోని పెద్దలు అంటూ కౌంటర్లు వేయడంతో ఎక్కువగా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాంటి పూనమ్ కౌర్ పేరు ఈ మధ్య పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని క‌ృష్ణ మురళీ పరోక్షంగా పేరు ఎత్తేశాడు. ఇక పంజాబీ నటి అంటూ ట్విట్టర్ ప్రపంచం మొత్తం పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేశారు. ఇక పూనమ్ కౌర్‌ కూడా ఈ విషయంలో పరోక్షంగా స్పందించింది. దాసరి గారు గుర్తుకు వస్తున్నారని, ఆయన్ను మిస్ అవుతున్నాను.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయన ఒక్కరే అని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. మరొక పోస్ట్‌లో అత్యాచారం, బాధితురాలు, అంటూ కొన్ని సందేశాత్మక వీడియోలను షేర్ చేసింది. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి కానీ.. నేను ఎందుకు సిగ్గుపడాలి.. నేను ఏం తప్పు చేశాను అంటూ ఓ మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. ఇక తాజాగా మరోసారి అలాంటి ఓ నర్మగర్భంగా ఉన్నటువంటి ట్వీట్ వేసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ వేసిందో సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ ఆ ట్వీట్ మీద మాత్రం చర్చ మొదలైంది. ‘ఒక్కోసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు.. మరి కొన్నిసార్లు ఇంకో అన్న గొప్పగా అనిపిస్తాడు.. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారే తప్పా.. ఆడవాళ్ల గురించి ఆలోచించేవారెవరున్నారు. మీరంతా మీ ఈగోలు, అజెండాల గురించి ఆలోచించే స్వార్థపరులు. ఏ ఒక్కరూ కూడా మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు’ అని పూనమ్ కౌర్ చేసిన పరోక్ష కామెంట్లు వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AXLrmW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....