- : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, ఏపీ ప్రభుత్వానికి మాటల యుద్ధం కొనసాగుతుంది. రీసెంట్‌గా జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వై.ఎస్.జగన్ ప్రభుత్వం పనితీరుని పవన్ విమర్శించడం..దానికి వారు బదులివ్వడం జరిగాయి. ఇప్పుడు ట్విట్టర్‌లో జగన్ చేసిన ప్రమాణాలు, నవరత్నాలుపై పవన్ కామెంట్ చేశారు. ‘‘ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఎన్నికల్లో గెలవడానికి ముందు వై.ఎస్.జగన్ చేసిన ప్రమాణాలు ఇప్పుడు వాటిని అమలు చేస్తున్న తీరు తెన్నులను తెలియజేస్తూ ఓ పోస్ట్ చేశారు పవన్. ఎలక్ట్రిసిటీ, ఉద్యోగాలు, వెనుకబడిన తరగతులు అభివృద్ధి తదితర అంశాలపై జగన్ చేసిన ప్రమాణాలను ఇప్పుడు ఎంత వరకు పాటిస్తున్నారో తేడాలను వివరించారు. అంటే తనదైన శైలిలో విమర్శ చేశారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన ఈ పోస్టుపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. శనివారం జరిగిన సినిమా వేడుకకు హాజరైన పవన్.. థియేటర్స్ ఆన్‌లైన్ విధానంలో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. తన సినిమాలను అడ్డుకోవడానికి సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు పవన్. కావాలంటే తన సినిమాలను బ్యాన్ చేసి చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని ఆయన తెలిపారు. దీనిపై మంత్రి పేర్ని నాని, అనిల్ కుమార్ తదితరులు ఆదివారం కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గొడవ సద్దుమణిగిందిలే అనుకుంటున్న సమయంలో మరోసారి పవన్ ట్విట్టర్ ద్వారా జగన్ పనితీరుని విమర్శిస్తూ పోస్ట్ చేశారు. దీనికి వైసీపీ లీడర్స్ ఎలా స్పందిస్తారో మరి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39FjVi3
No comments:
Post a Comment