Sunday, 26 September 2021

అఖిల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్.. ఈసారి పండుగకు సందడే

అక్కినేని నట అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా అక్కినేని అఖిల్ నటించిన ‘’.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఓ పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్.. సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, తాజాగా తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. ఇప్పటివరకూ సరైన హిట్ అందుకోలేకపోయారు అఖిల్. ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమాలు ఏమీ ఆయనకు మంచి బ్రేక్‌ను ఇవ్వలేకపోయాయి. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ అందుకోవాలి అని అఖిల్ భావిస్తున్నారు. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా విడుదల పలు మార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల కాగా.. సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఓ ఫ్లైట్‌లో అఖిల్, పూజా ఒకరి చేతులు మరొకరు పట్టుకొవడం మనం చూడొచ్చు. మరి ఈ సినిమాతో అయినా.. అఖిల్‌కి మంచి హిట్ లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EP1INv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....