Thursday, 30 September 2021

అల్లు రామలింగయ్య జయంతి.. విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు వారసులు

టాలీవుడ్‌లో అల్లు బ్రాండ్‌ను సపరేట్‌గా క్రియేట్ చేయాలని, తమ మార్క్ చూపించాలని తెగ తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో అనే ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో దూరమైపోయాడు. మెగా అనే పదాన్ని బన్నీ ఎక్కువగా వాడటం లేదు. ఇక అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్ భారీ ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అల్లు ఎంటర్టైన్మెంట్, అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్, బన్ని కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. గత ఏడాది అంగరంగ వైభవంగా ప్రారంభించిన అల్లు స్టూడియో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే శతజయంతి వేడుకుల మీద మెగా అభిమానులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన తాతకు నివాళి అర్పించారు. అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు బాబీ, అల్లు శిరీష్‌లతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఆయన మా ప్రతిష్ట, గౌరవం.. వాటిని అల్లు స్టూడియోలోని మా జర్నీతో ముందుకు కొనసాగిస్తామని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి పార్ట్ ఈ క్రిస్మస్ కానుకగా రాబోతోంది. ఇక అల్లు శిరీష్ అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రేమ కాదంటా? అనే సినిమాతో రాబోతోన్నాడు. అల్లు బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారబోతోన్నాడు. వరుణ్ తేజ్ గని సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3orsZQ6

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...