Thursday 30 September 2021

‘గతంలో అలా ఎప్పుడు చూసుండరు..’ ‘అఖండ’లో తన పాత్ర గురించి హీరో శ్రీకాంత్

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు . గతంలో నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కానీ, ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి కానీ, శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా శ్రీకాంత్ నటించిన మరో సినిమా ‘ఇదే మా కథ’. ఈ సినిమాలో భూమిక, సుమంత్ అశ్విన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైక్ రైడింగ్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ‘అఖండ’ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటుందని, గతంలో అలాంటి పాత్రలో తనని ఎప్పుడూ చూసి ఉండరు అని ఆయన అన్నారు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం బీభత్సంగా ఉంటాయని.. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారని ఆయన తెలిపారు. సినిమా చూసిన తర్వాత తనని తిట్టుకోవడం ఖాయమని ఆయన.. కానీ, ఈ పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3imP7XU

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz