సినీ పరిశ్రమను కోవిడ్ దారుణంగా దెబ్బతీసింది. రెండు వేవ్స్ రావడంతో సినిమా థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడానికే భయపడ్డారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అయితే థియేటర్స్ వైపు చూడటానికే ప్రేక్షకులు ఆలోచించారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. సినిమాలు విడుదలయ్యాయి కానీ అహో ఓహో అనేలా ఏ సినిమాను రాలేదు. ఈ నేపథ్యంలో సీటీమార్ కాస్తో కూస్తో పరావాలేదనిపించింది. అయితే లవ్‌స్టోరి రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరి’. మంచి హిట్ కాంబినేషన్ కావడంతో సినిమా ఓపెనింగ్ షోస్‌కు ప్రేక్షకులు కోవిడ్‌కు భయపడకుండా గుంపులుగుంపులుగా వచ్చారు. థియేటర్స్ వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. లవ్‌స్టోరి విడుదలైన రోజు నుంచి సినిమా సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఈ మూవీ తన మార్క్ క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు యు.ఎస్‌లో వన్ మిలియన్ మార్కును టచ్ చేసింది. ఆదివారంకు లవ్‌స్టోరి వన్ మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధిస్తుందని విశ్లేషకు చెప్పినట్లే జరిగింది. నాగచైతన్య సోలో హీరోగా ఈ వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. కోవిడ్ పరిస్థితుల్లో ఓవర్‌సీస్ మార్కెట్ పూర్తిగా డీలా పడింది. ఈ నేపథ్యంలో లవ్‌స్టోరి సక్సెస్ టాలీవుడ్‌కు కొత్త ఊపిరినిచ్చిందని చెప్పాలి. ఆదివారం రోజు నాటికి 226 లొకేషన్స్ లక్ష డాలర్స్ పైగా వసూలు చేసి వన్ మిలియన్ అనే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు సహా మూడు రోజుల్లో లవ్‌స్టోరికి దాదాపు పాతిక కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం రోజున ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. ఇదంతా ఓకే అయితే .. ఇప్పుడు ఇతర స్టార్ హీరోల సినిమాలకు ఆ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయా? అనే మాటలు వినపడుతున్నాయి. మిగతా హీరోల్లో నాగచైతన్య ఛాలెంజ్ విసిరి తెలియని ఓ టెన్షన్‌ను క్రియేట్ చేశాడనే చెప్పాలి. మరి చైతన్య విసిరిన వసూళ్ల ఛాలెంజ్‌ను భవిష్యత్తులో ఏ హీరోలు క్రాస్ చేస్తారో చూడాలి. అయితే స్టార్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్స్ ఉన్న పెద్ద సినిమాలకు లవ్‌స్టోరి కాస్త ధైర్యాన్నిచ్చిందనే చెప్పాలి. యు.ఎస్‌లో మార్కెట్ ఓపెన్ అయ్యింది. ట్రిపుల్ ఆర్, ఆచార్య సహా పెద్ద చిత్రాలన్నీ ధైర్యంగా ముందడుగు వేయబోతున్నాయనడంలో సందేహం లేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zO3oD0
No comments:
Post a Comment