
కొన్ని రోజులుగా తమిళ నటి, బిగ్ బాస్ ఫేం ఇష్యూ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె చిక్కుల్లో పడింది. దళితులను ఇండస్ట్రీ నుండి తరిమేయాలని మీరా చెప్పడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటిస్ యాక్ట్ క్రింద సెక్షన్ 153A(1)(a), 505(1)(b), 505 (2) ప్రకారం కేసులు నమోదయ్యాయి. అయితే ఆమెకు తాజాగా ఊరట లభించింది. జైలులో ఉన్న ఆమెకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బుధవారం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేయగా, నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సినీ రంగంలోని ఎస్సీ, ఎస్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆగస్టు 14న పోలీసులు ఆమెను కేరళలో అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులొనే ఆమె స్నేహితులకు కూడా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెలువడింది. దీంతో ఆమె పోలీస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో ఆమె స్నేహితుడు అభిషేక్ కూడా అరెస్టయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ జైలులోనే ఉన్నారు. కోర్టు వీరిద్దరికీ రూ. 10 వేల చొప్పున పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. అలాగే, ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసుల ఎదుట హాజరు కావాలని, సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం చేయవద్దని ఆదేశించింది. బెయిలు మంజూరు చేయడంతో నిన్న జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zDkG5D
No comments:
Post a Comment