Monday 20 September 2021

Scam sood అంటూ దారుణమైన ట్రోల్స్.. సోనూ సూద్‌పై ట్వీట్ వేసి డిలీట్ చేసిన పూనమ్ కౌర్

గత రెండు మూడు రోజులుగా మీద వస్తోన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు సోనూ సూద్. ఇక రియల్ హీరోగా సోనూ సూద్‌ను ప్రజలు కీర్తిస్తున్నారు. పూజిస్తున్నారు. అలాంటి సోనూ సూద్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. ఆస్తులు, పన్నులు, టాక్సులు వంటి విషయాల్లో సోనూ సూద్ మీద కొన్ని వార్తలు వస్తుంటాయి. అయితే ఈ మధ్య సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. 20 కోట్ల పన్నులు ఎగవేశారంటూ ఐటీ అధికారులు వెల్లడించారు. దీనిపై సోనూసూద్ పరోక్షంగా స్పందించాడు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని, మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీలు కూడా తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశాయని, కానీ తనకు వాటిపై ఆసక్తి లేదని తిరస్కరించినట్టు చెప్పాడు. విరాళంగా వచ్చిన ప్రతీ రూపాయిని అవసరంలో ఉన్న వారికోసం వాడుతాను అంటూ సోనూ సూద్ చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సోనూ సూద్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. స్కామ్ సూద్ (Scam sood) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద ప్లాన్‌తో ఉన్నాడని, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే తెలుసు.. ముందు ఆ ఇరవై కోట్లకు లెక్కలు చెప్పు.. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ముందుగానే ఇదంతా ప్లాన్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.. అంటూ ఇలా కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సోనూ సూద్ జరుగుతున్న ఈ ట్రోలింగ్‌పై ఫైర్ అయింది. సోనూ సూద్ అంటే మీకు ఎందుకు అంత అసూయ, ద్వేషం అని ప్రశ్నించింది. కానీ ఆ వెంటనే ఆ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేసేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nNbPw4

No comments:

Post a Comment

'Didn't Know Mirch Masala Would Be...'

'She was my only choice to play Sonbai. The moment she read the script, she slipped into character.' from rediff Top Interviews ht...