Monday, 20 September 2021

ఆ సినిమానే దెబ్బ కొట్టిందా..? డైరెక్షన్‌‌కి గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవ నిర్ణయం

భారతదేశ సినిమాలలో డ్యాన్స్ అనగానే అందరకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు . కొరియోగ్రాఫర్‌గా ఎన్నో సూపర్‌హిట్ పాటలకు స్టెప్పులు కంపోజ్ చేసిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారిపోయారు. 60కి పైగా చిత్రాల్లో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా పాత్రల్లో నటించి ఆయన ప్రేక్షకులకు వినోదం పంచారు. ఇక నటుడిగా చేస్తూనే దర్శకుడిగా కూడా మారిపోయారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ.. గత కొంతకాలంగా మాత్రం బోల్తాపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాణ్ ఖాన్ హీరోగా.. హీరోయిన్‌గా ఆయన ‘’ అనే సినిమాను రూపొందించిన ప్రభుదేవ. భారీ బడ్జెట్, యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు.. చాలా సీన్లలో అవసరం లేని యాక్షన్ సన్నివేశాలు ఉంటంతో ఘోరంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా తో ప్రభుదేవపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన ఇకపై సినిమాకు డైరెక్షన్ చేయాలనే ఆలోచన మానుకొని.. కొరియోగ్రాఫిపై దృష్టి కేంద్రీకరించాలని అభిమానులు సూచన చేశారు. ఇప్పుడు ప్రభుదేవ కూడా అదే నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఇకపై డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పి.. కొరియోగ్రాఫి.. యాక్టింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకు మరో కారణం కూడా తెలుస్తోంది. ఆయనకు సినిమాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుండటంతో.. ఆయన డైరెక్షన్‌పై దృష్ఠి పెట్టలేకపోతున్నారట. దీంతోనే ఆయన డైరక్షన్‌ను మానుకోవాలని ఫిక్స్ అయ్యారు అని టాక్. ప్రస్తుతం ప్రభుదేవ.. తమిళంలో ‘పొన్ మానిక్కవెల్, థేల్, యంగ్ మంగ్ సంగ్, భగీరా’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hNCWU6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....