
ఈ మధ్యకాలంలో సినిమాలు రూపొందించడం ఒకెత్తయితే వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తవుతోంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నింటినీ డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తూ హైప్ తీసుకొస్తేనే ఆ సినిమాను బెస్ట్ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. అందుకే నేటితరం దర్శకనిర్మాతలంతా అదే మాత్రం ఫాలో అవుతున్నారు. తాజాగా యంగ్ హీరో కొత్త సినిమా 'ఇందువదన' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకుంది చిత్రయూనిట్. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ సమర్పణలో MSR దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇందువదన'. శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, జంటగా నటిస్తున్నారు. ఒకానొక సమయంలో వెండితెరపై ఆకట్టుకొని చాలా ఏళ్ళ తర్వాత 'ఇందువదన' సినిమాతో రీ- ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ మేరకు సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన 'ఇందువదన' ఫస్ట్ లుక్ చాలా కళాత్మకంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచేసి చాలా అద్భుతంగా ఈ పోస్టర్ డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఈ పోస్టర్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. వరుణ్ సందేశ్ కూడా 'ఇందువదన' సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలపనుంది చిత్రయూనిట్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3371bVd
No comments:
Post a Comment