Sunday, 25 April 2021

ఆదితో అవికా గోర్ రచ్చ.. ‘అమరన్’ కథ షురూ

సాయి కుమార్ చివరగా శశి సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో శశి సినిమా మీద అంచనాలు పెరిగాయి. కానీ వాటిని శశి అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆది మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి ఆది సాయి కుమార్ చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్‌తో కలిసి రాబోతోన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఆదిసాయికుమార్ హీరోగా హీరోయిన్ గా ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్ చిత్రం 'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' ప్రారంభమైంది. ఈ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో 'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' సినిమా రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్‌ టచ్‌ కూడా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత‌లు. అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్‌ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్‌ చేసే కథాంశంతో థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్‌, పవిత్రా లోకేశ్‌, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sQ4JWD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....