Sunday, 25 April 2021

హోటల్ రూంలో అలాంటి చేష్టలు.. కార్తికేయతో లావణ్య త్రిపాఠి రచ్చ!

ఓ సినిమాతో హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. కొందరు సినిమా వరకు సన్నిహితంగా ఉంటారు. ఇంకొందరు సినిమా ముగిసినా కూడా స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అలా ఇప్పుడు , సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చిత్రంతో ఈ జోడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే కుదిరింది. చావు కబురు చల్లగా విషయంలో హీరో హీరోయిన్లు ఆశించినంతగా విజయం దక్కకపోయినా కూడా తమ పాత్రలకు మంచి పేరు రావడంతో ఖుషీ అవుతున్నారు. ఈ మధ్యే ఈ మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. సినిమా కథ, తన పాత్ర విన్న వెంటనే ఓకే చెప్పేశానని, హీరో ఎవ్వరనే విషయాన్ని కూడా పట్టించుకోలేదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. కెరీర్‌లో మొదటి సారి ఇలా విడో పాత్రను పోషించడం చాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చారు. తాజాగా లావణ్య త్రిపాఠి ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో హోటల్ రూంలో తాను చేసిన కొంటె పనుల గురించి బయట పెట్టేశారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, చిత్ర దర్శకుడు కౌశిక్ అందరూ కూడా ఒకే హోటల్‌లో బస చేసినట్టున్నారు. ఈక్రమంలో హీరోయిన్, దర్శకుడు కలిసి కార్తికేయను ఓ ఆట ఆడుకున్నారు. లావణ్య త్రిపాఠి పదే పదే విసిగించడంతో కార్తికేయకు చిర్రెత్తుకొచ్చింది. కార్తికేయ తన రూంలో తాను ఉంటుంటే.. పదే పదే వెళ్లి కాలింగ్ బెల్ నొక్కి డిస్టర్బ్ చేసేశారు లావణ్య త్రిపాఠి. అలా ఐదారు సార్లు కాలింగ్ బెల్ నొక్కేసి కార్తికేయకు పిచ్చెక్కించారు. అలా చివరకు కార్తికేయకు సహనం నశించి ఎవరు ఇదంతా చేస్తున్నారంటూ ఆగ్రహంతో బయటకు వచ్చారు. అలా బయటకు రాగానే దర్శకుడు కౌశిక్ ఉన్నాడు. నేను చేయలేదు.. ఆమె చేసిందంటూ లావణ్య త్రిపాఠి వైపు చూపించారు. నేను చేయలేదు.. నువ్వే కదా? చేశావ్ అంటూ దర్శకుడిని ఇరికించే ప్రయత్నం చేశారు లావణ్య త్రిపాఠి. మొత్తానికి కార్తికేయకు మాత్రం చుక్కలు చూపించేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QR9wJY

No comments:

Post a Comment

What Tahawwur Rana Can Expect In Tihar

'It is ensured that no adversaries or people who oppose Tahawwur Rana's philosophy are housed in the same ward or jail.' from ...