Sunday, 25 April 2021

కరోనా విలయతాండవంలో సనీ ప్రముఖుడి పెళ్లి.. మహానటితో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ సందడి

ఓ వైపు కరోనా వీరవిజృంభణ కొనసాగుతుంటే మరోవైపు వరుసపెట్టి సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కడం గతేడాదే చూశాం. కరోనా కేసులు పెరుగుతుండటంతో షూటింగ్స్ వాయిదా పడటం, దీంతో ఇదే బెస్ట్ టైమ్ అని భావించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మరో అడుగు ముందుకేసి మూడుముళ్ల బంధానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుతో పాటు త‌మిళ హిట్ సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన జీకే విష్ణు తన పెళ్లి తంతు ముగించేశాడు. అట్లీ దర్శకత్వంలో కమాండర్ విజయ్ నటించిన ''అదిరింది, విజిల్'' సినిమాలతో పాటు తెలుగు చిత్రం 'క్రాక్‌'కి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు జీకే విష్ణు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో ఆయన ఓ ఇంటివాడయ్యాడు. ఈ రోజు (ఆదివారం) చోలింగనల్లూర్ ఇస్కాన్ ఆలయంలో ఆయన పెళ్లి జరిగింది. పి.మహాలక్ష్మి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ కీర్తి సురేష్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ విచ్చేసి సందడి చేశారు. ఈ పెళ్లి వేడుక‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, కీర్తి సురేష్ క‌లిసి దిగిన సెల్ఫీ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కూడా మాస్క్‌ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరించిన 'క్రాక్' సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aEG3df

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...