Sunday, 25 April 2021

వామ్మో.. మంచు లక్ష్మికి ఏమైందో ఆ దేవుడికే అర్ధం కావాలా..! చీరలోనే అలా చేసే సరికి అంతా షాక్

అబ్బబ్బ .. నా రూటే సపరేటు, మాటలతోనే కాదు చేతలతో కూడా మజా చేయగలను అని చాటుకుంటోంది ఈ స్టార్ కిడ్. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పోస్టులతో వార్తల్లో నిలిచే మంచువారమ్మాయి తాజాగా ఓ వెరైటీ వీడియో షేర్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో చూసిన జనాలు ముక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి. ఇందులో అలాంటి పని చేసింది మరి మంచు లక్ష్మి. దీంతో నెటిజన్స్ వామ్మో! అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ రోజుల్లో హీరోయిన్స్ అంతా ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం జిమ్ములకు పోవడం, ఇంట్లో వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ చెమటోడుస్తున్నారు. అయితే జనరల్‌గా వ్యాయామం చేసే సమయంలో వేసుకునే డ్రెస్ వేరే ఉంటుంది. అది ఇళ్లయినా జిమ్ అయినా టీ-షర్ట్, షార్ట్స్ లాంటివి ధరించి వ్యాయామాలు చేస్తుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా చీరకట్టి వ్యాయామానికి దిగింది మంచు లక్ష్మి. ఏదో సరదాకు చేసిందో.. లేక నిజంగానే రోజూ ఇలానే చేస్తుందో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. కేవలం మాటల్లోనే కాదండోయ్ చేతల్లోనూ మంచు వారమ్మాయి రూటే సపరేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా 'ఏంటి కర్మ నువ్వు ఒక లెజెండ్ కూతురు అన్న సంగతి మర్చిపోకు' అంటూ కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి.. 'ఏంటో నువ్వు ఆ దేవుడికే అర్ధం కావాలి ఎవరికీ అర్ధం కావు ఏం చేస్తాం.. కానియ్ కానియ్' అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయినా మంచు లక్ష్మికి ట్రోల్స్ కొత్తేమీ కాదులెండి. మొన్నటికి మొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి కరోనా సోకితే ఆమె పెట్టిన కామెంట్ ఎంత రచ్చ చేసిందో మనందరికీ తెలుసు. ఆ వెంటనే వావ్ అంటూ ఓ శాస్త్రవేత్త మరణంపై ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కాకపోతే మంచు లక్ష్మి మాత్రం తనపై వస్తున్న ట్రోల్స్ పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3erTNcx

No comments:

Post a Comment

The Manmohan Singh Interview You Must Read

'We are going to need more technical people in government.' from rediff Top Interviews https://ift.tt/CkfAJzb