Sunday, 25 April 2021

సీక్రెట్‌గా డేటింగ్‌ చేశాం.. నా దిగులంతా అతని ఆరోగ్యం గురించే: హీరోయిన్ సంజన

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లొచ్చిన కన్నడ నటి సంజనా గల్రానీ తాజాగా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది. డ్రగ్స్ కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటకొచ్చి తన ప్రియుడిని పెళ్లాడింది. సీక్రెట్ గానే ఏడడుగులు వేసిన ఈ అమ్మడు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన వివాహ బంధానికి సంబంధించిన విషయాలపై రియాక్ట్ అయింది. గతేడాది తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన సంజన.. ఈ నూతన సంవత్సరంలో జీవితాన్ని కొత్తగా ప్రారంభించానని చెప్పింది. చిన్ననాటి స్నేహితుడైన అజీజ్‌ పాషాతో ఇటీవల ఏడడుగులు వేశానని.. వృత్తిరీత్యా ఆయన వైద్యుడని, బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేస్తున్నారని తెలిపింది. తామిద్దరం ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచామని చెప్పుకొచ్చింది. మొదట స్నేహితులుగా ఉన్న తాము స్నేహం కొంతకాలానికి ప్రేమికులుగా మారి డేటింగ్‌ కూడా చేశామని చెప్పింది. గతేడాది తాను జైలుకి వెళ్లినప్పుడు కూడా పాషా, అతని కుటుంబం తనకు అండగా నిలబడ్డారని చెప్పిన ఆమె.. బెయిల్‌పై బయటకు రాగానే అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన నిత్యం హాస్పిటల్‌కి వెళ్లి కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు కాబట్టి తమకూ కరోనా సోకిందని సంజన వెల్లడించింది. 'ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నా కానీ నా దిగులంతా అతని ఆరోగ్యం గురించే' అని సంజన తెలిపింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nhCvTt

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...